Revanth reddy : కీలక ఆదేశం... మెట్రో టెండర్లు నిలిపేయండి
మెట్రో విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు
మెట్రో విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకూ నిర్మించ తలపెట్టిన మెట్రోపనులను నిలిపి వేయాలని అధికారులను ఆదేశించారు. అవుటర్ రింగ్ రోడ్డు వెంట జీవో 111 ప్రాంతంలో మెట్రో అలైన్‌మెంట్ రూపొందించడంపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈ ఆదేశాలను జారీ చేశారు. రాయదుర్గం - శంషాబాద్ మెట్రో పనులను నిలిపివేసి, ఎంజీబీఎస్, ఫలక్‌నుమా, చంద్రాయణగుట్ట, ఎయిర్ పోర్టు మీదుగా మరో మార్గం ద్వారా ప్రతిపాదనలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఈ రెండు మార్గాలను...
రెండు మార్గాలను పరిశీలించాలని, ఒకటి.. చంద్రాయణగుట్ట, మైలార్ దేవ్‌పల్లి, జల్‌పల్లి విమానాశ్రయం వరకూ... రెండోది చాంద్రాయణగుట్ట, బార్కాస్, పహాడీషరీఫ్, శ్రీశైలం రోడ్లను పరిశీలించాలని ఆయన ఆదేశించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను రూపొందించాలని కోరారు. రాయదుర్గం - శంషాబాద్ మెట్రో టెండర్లను నిలిపివేయాలని ఆదేశించారు. ఎక్కువ జనాభాకు ఉపయోగపడే విధంగా మెట్రో సేవలను అందించేలా ప్రతిపాదనలను రూపొందించాలని ఆయన అధికారులను కోరారు.