Revanth Reddy : భేటీకి రెడీ అన్న రేవంత్.. వెన్యూ కూడా చెప్పి మరీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు;

Update: 2024-07-02 14:06 GMT
chief ministers, telangana, andhra pradesh, meeting
  • whatsapp icon

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ఈ నెల 6వ తేదీన సమావేశానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ సమావేశం ప్రజాభవన్ లో జరుగుతుందని కూడా ఆయన వెన్యూ కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసిన సంగతి తెలిసిందే.

రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా...
రెండు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇరువురం కలసి కూర్చుని చర్చించుకుంటే మంచిదని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అనేక అంశాలు పెండింగ్ లో ఉండటంతో దానిపై చర్చించుకుని పరిష‌్కరించుకుందామని లేఖ రాసిన చంద్రబాబును సమావేశానికి సాదరంగా రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.


Tags:    

Similar News