Revanth Reddy : నేడు ఝార్ఖండ్‌కు రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఝార్ఖండ్ కు వెళ్లనున్నారు. భారత్ జోడో న్యాయయాత్రలో ఆయన పాల్గొననున్నారు

Update: 2024-02-05 03:00 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఝార్ఖండ్ కు వెళ్లనున్నారు. భారత్ జోడో న్యాయయాత్రలో ఆయన పాల్గొననున్నారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా వెళ్లనున్నారు. మధ్యాహ్నం రాంచీలో జరిగే రాహుల్ సభకు వీరు హాజరు కానున్నారు. ఝార్ఖండ్ లో ఇటీవల నాటి ముఖ్యమంత్రి హేమంతో సోరెన్ పై ఈడీ దాడులు చేయడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు.

న్యాయ యాత్రలో...
ఆయన స్థానంలో చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను తీసుకున్నారు. నేడు చంపై సోరెన్ అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోనున్న నేపథ్యంలో హైదరాబాద్ లో కొద్ది రోజులుగా ఉన్న జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలు రాంచీకి బయలుదేరి వెళ్లారు. రేవంత్ రెడ్డి కూడా బలపరీక్ష రోజు రాంచీ బయలుదేరి వెళుతుండటం విశేషం. అక్కడ రాహుల్ గాంధీ బహిరంగ సభలో పాల్గొని తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.


Tags:    

Similar News