Revanth Reddy : నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. అన్ని విషయాలు అక్కడే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధానంగా ఆరు ఎమ్మెల్సీ పోస్టుల భర్తీతో పాటు కేబినెట్ లో ఆరుగురు మంత్రుల నియామకంపై హైకమాండ్ తో చర్చించనున్నారు. ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 11 మంది మంత్రులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. పూర్తి స్థాయ మంత్రి వర్గం ఏర్పాటు చేయాలంటే మరో ఆరు పదవులను భర్తీ చేయాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించిన క్లారిటీని హైకమాండ్ వద్ద నుంచి తీసుకునేందుకు బయలుదేరి వెళ్లారు.
ఈ నెలలోనే మంత్రి వర్గ విస్తరణ....
డిసెంబరు 9వ తేదీన రెండు గ్యారంటీలను అమలు పర్చిన ప్రభుత్వం రానున్న వంద రోజుల్లో మిగిలిన గ్యారంటీలను కూడా అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది. దీనిపైన కూడా పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. ఈ నెల 24 లేదా 25వ తేదీన కేబినెట్ ను విస్తరించాలన్న యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. అందుకే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కీలకంగా మారింది. ఆశావహులన్నీ ఆయన పర్యటన తర్వాత వచ్చే సంకేతాల కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఎవరి పేర్లను ఖరారు చేసుకు వస్తారోనన్నది ఆసక్తికరంగా మారింది.