వారణాసిలో కేసీఆర్ ఫ్లెక్సీలు
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపు వారణాసికి వెళుతున్నారు. యూపీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు.;
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపు వారణాసికి వెళుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. యూపీ ఎన్నికలకు సంబంధించి ఆరు దశల్లో పోలింగ్ జరిగింది. మరో వంద నియోజకవర్గాలకు పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే ఇటీవల బీజేపీ పైనా, కేంద్ర ప్రభుత్వంపైన విరుచుకుపడుతున్న కేసీఆర్ యూపీ ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు.
ప్రచారం అక్కడే....
అదీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో కేసీఆర్ పర్యటించనున్నారు. బీజేపీ కి వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నారు. అయితే కేసీఆర్ రాక సందర్భంగా వారణాసిలో పెద్దయెత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. దేశ్ కా నేత అంటూ పెద్దయెత్తున ఫ్లెక్సీలు కట్టడం చర్చనీయాంశమైంది.