రేవంత్ రెడ్డి అరెస్ట్

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు

Update: 2021-12-27 07:56 GMT

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన తన ఇంటి నుంచి ఎర్రవెల్లి వెళ్లేందుకు బయలుదేరిన వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా అడుగడుగునా కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసేముందు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

బయటకు రాగానే....
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాం హౌస్ ఉన్న ఎర్రవెల్లి వద్ద రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఆయనను ఎర్రవెల్లి వెళ్లకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ రేవంత్ రెడ్డి ఎర్రవెల్లి వెళ్లేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించడంతో ఆయనను అరెస్ట్ చేశారు.


Tags:    

Similar News