ముగిసిన కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన.. షెడ్యూల్‌ గురించి ఏమన్నారంటే..

లంగాణ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ముగిసింది. ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా..

Update: 2023-10-06 04:07 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ముగిసింది. ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో పాటు అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు చీఫ్‌ ఎలక్షన్ కమిషనర్‌ ప్రకటించారు. రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న తెలంగాణలో ఎన్నికల సంసిద్ధతను అంచనా వేయడానికి ఈసీ బృందం మూడు రోజుల పర్యటన ముగింపు సందర్భంగా రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడారు . అయితే, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం గురించి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు. ఇక తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ ఇక రేపో మాపో విడుదల కానుంది. హైదరాబాద్‌లో మూడు రోజులున్న ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌, కమిషనర్లు అనూప్‌ చంద్ర పాండే, అరుణ్‌ గోయల్‌ తెలంగాణ ఎన్నికల సన్నద్ధతను నిశితంగా పరిశీలించారు.

రాజకీయ పార్టీలు, నిబంధనలను అమలు చేసే ప్రభుత్వ వ్యవస్థలతో ఎన్నికల సంఘం హైదరాబాద్‌లో సమావేశమైంది. ఎన్నికల్లో డబ్బు పంపిణీ, ఉచిత కానుకలు అందజేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఓటర్లను ప్రభావితం చేయకుండా అనేక చర్యలు చేపట్టనున్నట్టు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, మహారాష్ట్ర నుంచి రాకపోకలను పర్యవేక్షించేందుకు 148 చెక్‌ పాయింట్స్‌ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది.

ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఎన్నికల షెడ్యూల్‌ ఎప్పుడు వస్తుందనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. ఇక్కడ మీకు చెప్పలేమని, మీడియాకే ముందు వెల్లడిస్తామని అన్నారు.
తప్పుడు అఫిడవిట్లకు సంబంధించి నిర్ణీత పద్ధతి ఉంటుందని, దాని ప్రకారమే తాము నడుచుకుంటామని చీఫ్‌ ఎలక్షన్ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. మనీ వ్యాలెట్స్‌ ద్వారా ఆన్‌లైన్‌లో జరిపే నగదు లావాదేవీలపై కూడా నిఘా ఉంటుందని చీఫ్‌ ఎలక్షన్ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ప్రకటించారు. తప్పుడు వార్తలను అరికట్టేందుకు జిల్లా స్థాయిలో సోషల్‌ మీడియా సెల్‌ ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా నిర్వహించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అక్రమ మద్యం విక్రయ కేంద్రాలను మూసివేసేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్‌లో ఉన్న ఎన్‌బీడబ్ల్యూలను సకాలంలో అమలు చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు.
Tags:    

Similar News