తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
తెలంగాణ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మరో రెండింటిని అమలు చేసేందుకు
తెలంగాణ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మరో రెండింటిని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఫరా ఇంజినీరింగ్ కాలేజ్ మైదానంలో జరిగే బహిరంగ సభలో రెండు హామీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. గృహజ్యోతి పథకం కింద రేషన్ కార్డులు ఉన్న వారికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం కింద రూ.500లకు గ్యాస్ సిలిండర్ హమీలను ప్రారంభిస్తారు.
ప్రియాంక గాంధీ దూరం:
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ హాజరవుతారని పార్టీ నేతలు ప్రకటించారు. అనివార్య కారణాల వల్ల ప్రియాంక గాంధీ రాలేకపోతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున మహిళలను తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.
ఈ ఉచిత పథకాల్లో లబ్ధిదారులను చేర్చడం నిరంతరం కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తమకు రాలేదంటూ ఎవరూ ఆందోళన పడొద్దని.. ఎవరికైనా ఏ కారణంగా అయినా గ్యాస్ సిలిండర్, ఫ్రీ కరెంట్ రాకపోతే అలాంటి వారు మండల కేంద్రంలోని ప్రభుత్వ అధికారులకు సంప్రదించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని.. ఎవరూ ఆందోళన చెందొద్దని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. రేషన్ కార్డు లేకపోతే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు రేషన్ కార్డు ద్వారా పేదలను గుర్తించి అర్హులకే పథకాలు అమలు చేస్తున్నామన్నారు.