Telangana : మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రెడీ అయింది
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని మంత్రి సీతక్క తెలిపారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా ఈ పథకాన్ని త్వరలో అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. అర్హులైన మహిళల జాబితాను సిద్ధం చేస్తుంది. తెల్లకార్డు ఉన్న వారంతా ఈ పథకానికి అర్హులుగా ప్రకటించనున్నారని తెలిసింది.
ఇచ్చిన హామీ మేరకు...
తాము అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని తెలిపింది. అయితే ప్రభుత్వం అధికారంలోకి రాగానే పార్లమెంటు ఎన్నికలు రావడం, ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి ఈ పథకం అమలకు అడ్డుపడిందని మంత్రి సీతక్క తెలిపారు. ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే కార్యక్రమంలో భాగంగా మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని మంత్రి సీతక్క తెలిపారు.