తెలంగాణలో కరోనా ఆంక్షల గడువు పెంపు
తెలంగాణ ప్రభుత్వం కరోనా ఆంక్షల గడువును పెంచింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది
తెలంగాణ ప్రభుత్వం కరోనా ఆంక్షల గడువును పెంచింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో కోవిడ్ ఆంక్షలను ఈ నెల 31వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి వరకూ ఎలాంటి బహిరంగ సమావేశాలు, సభలు జరపడానికి వీలు లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది.
మాస్క్ ధరించకపోతే....?
అలాగే ఎక్కువ మంది జనసమూహాలు ఒక చోట చేరవద్దని సూచించింది. మాస్క్ లేకుండా బయటకు వస్తే వెయ్యి రూపాయలు జరిమానాను ముక్కుపిండి వసూలు చేస్తామని తెలిపింది. ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించాలని కోరింది. గత రెండు రోజుల నుంచి తెలంగాణలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం ఆంక్షల గడువును పెంచింది.