Telangana : ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం
అవుటర్ రింగ్ రోడ్డు పరిధిలోని గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేస్తూ తెలంగాణ ప్రభుత్వంనోటిఫికేషన్ ను జారీ చేసింది
అవుటర్ రింగ్ రోడ్డు పరిధిలోని గ్రామాలను మున్సిపాలిటీలలో విలీనం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ను జారీ చేసింది. సమీపంలోని మున్సిపాలిటీల్లోకి ఈ గ్రామాలను కలుపుతూ నిర్ణయం తీసుకుంది. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోకి పూడూర్, రాయల్‌పూర్ గ్రామాలు రానున్నాయి. దమ్మాయిగూడ మున్సిపాలిటీలోకి కీసర, యాదగిరి పల్లి, అంకిరెడ్డి, చిర్యాల, సర్సంపల్లి, తిమ్మాయిపల్లి గ్రామాలు విలీనం కానున్నాయి.
వివిధ గ్రామాలన్నీ...
పోచారం మున్సిపాలిటీలోకి బోగారం, గోధముకుంట, కరీంగూడా, రాంపల్లి దయారా, వెంకటాపూర్, ప్రతాప్ సింగారం, కొర్రెముల, కాచవాని సింగారం, చౌదరిగూడ గ్రామాలు విలీనం అవుతాయి. దీంతో పాటు ఘట్‌కేసర్ మున్సిపాలిటీ పరిధిలోకి అంకుశపూర్, మందారం, ఎదులాబాద్, ఘనపూర్, మణిప్యాల్ గూడ గ్రామాలు విలీనమవుతాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోకి మునిరాబాద్, గౌడవెల్లి గ్రామాలు విలీనం కానున్నాయి. తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోకి బొంరాస్ పేట, శామిర్ పేట, బాబాగుడ గ్రామాలు విలీనమవుతాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.