Breaking : రేపటి వరకూ కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట

కేటీఆర్ కు చెందిన జువ్వాడ ఫామ్ హౌస్ ను రేపటి వరకూ కూల్చవద్దంటూ హైకోర్టు ఆదేశించింది.;

Update: 2024-08-21 07:29 GMT

Telangana high court

జువ్వాడ ఫామ్ హౌస్ ను రేపటి వరకూ కూల్చవద్దంటూ హైకోర్టు ఆదేశించింది. జువ్వాడలోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చి వేయడానికి అభ్యంతరాలు తెలుపుతూ హైడ్రా నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులు అందుకున్న కేటీఆర్ తరుపున ప్రదీప్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

లీగల్ స్టేటస్ ఏంటి?
దీనిపై నేడు విచారణ జరిగింది. ఫాం హౌస్ కూల్చకుండా స్టే ఇవ్వాలనికోరారు. ఇటీవల హైడ్రా నగరంలో చెరువులను ఆక్రమించి నిర్మించిన భవనాలను కూల్చివేస్తున్న నేపథ్యంలో హైడ్రా విధివిధానాలేంటి అని ప్రభుత్వ తరుపున న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. హైడ్రాకు ఉన్న లీగల్ స్టేటస్ ను రేపు వివరిస్తానని ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీంతో రేపటి వరకూ నిర్మాణాలను కూల్చివేయవద్దని హైకోర్టు ఆదేశించింది. అయితే విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది


Tags:    

Similar News