తెలంగాణ ఇంటర్ ఫలితాలు
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 1.60 లక్షల మంది ఫస్ట్ గ్రేడ్‌లో పాస్ అయ్యారని తెలిపారు. సెకండ్ ఇయర్ 2.64 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణులులయ్యారని తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 63.85 శాతం, సెకండ్ ఇయర్ లో 67.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రేపటి నుంచి రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు అవకాశముంటుందని తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షకు కూడా రేపటి నుంచి ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించ వలసిన అవసరం ఉందని తెలపారు.
జూన్ 4 నుంచి సప్లిమెంటరీ...
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పై చేయి అని మంత్రి తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో మేడ్చల్ జిల్లా, సెకండ్ ఇయర్ ఫలితాల్లో ములుగు జిల్లా తొలి స్థానం దక్కించుకుందని సబిత ఇంద్రారెడ్డి తెలిపారు. ఇంటర్ సెకండ్ ఇయర్ లో 73, 061 మందికి ఫస్ట్ గ్రేడ్ వచ్చిందన్నారు. జూన్ 4 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఉ:ంటాయని తెలిపారు. ఫెయిల్ అయిన వారు నిరాశ పడవద్దని, సప్లిమెంటరీ పరీక్షలకు హాజరై ఉత్తీర్ణత అయ్యేందుకు అవకాశముందని, వీరితో పాటే కళాశాలలో జాయిన్ అయ్యే అవకాశముందని సబిత ఇంద్రారెడ్డి తెలిపారు. విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని, నిరాశకు గురైన పిల్లలు హెల్పలైన్‌ను సంప్రదించాలని, 14416 హెల్ప్ లైన్‌ను సంప్రదించాలని కోరారు.