ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్
సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులకు టిక్కెట్ లో పది శాతం రాయితీ కల్పించాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది.
సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులకు టిక్కెట్ లో పది శాతం రాయితీ కల్పించాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. రానుపోను ఒకేసారి టిక్కెట్లు రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులకు టిక్కెట్ లో పది శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించామని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
పదిశాతం రాయితీ...
తిరుగు ప్రయాణ ఛార్జీలో పది శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ ప్లస్ బస్సుల్లో రిజర్వేషన్ చేయించుకున్న వారికి మాత్రమే ఈ అవకాశముంటుంది. జనవరి 31వ తేదీ వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని సజ్జనార్ తెలిపారు. రిజర్వేషన్ చేయించుకున్న వారికి తక్షణమే ఈ సదుపాయం వర్తిస్తుందని తెలిపారు.