నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు.;

Update: 2024-10-06 02:23 GMT

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. తీవ్రవాద నిరోధంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోం శాఖ నిర్వహించే సమావేశానికి వీరిద్దరూ హాజరు కానున్నారు. మరోవైపు వరద పరిహారం విషయమై సీఎం రేవంత్ కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలోనే కాంగ్రెస్ అగ్రనేతలను సీఎం రేవంత్ కలవొచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి.

చంద్రబాబు మాత్రం....
మరోవైపు చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలోనే ఉండి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాను కలవనున్నారు. రాజధాని అమరావతి ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు సంబంధించి చర్చించనున్నారు. దీంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు కూడా ఇవ్వాలని కోరనున్నారు. ఇక ఇటీవల తలెత్తిన తిరుమల లడ్డూ వివాదంపై ఇరువురికి వివరించనున్నారు. ఇక కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలసి విశాఖ జోన్ కు సంబంధించి భూమి పూజ కార్యక్రమంపై మాట్లాడనున్నారని తెలిసింది.


Tags:    

Similar News