రండి బంగారాన్ని కొనేసుకోండి

బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ధర తగ్గినా, పెరిగినా బంగారం కొనుగోళ్లు, అమ్మకాలు మాత్రం ఎప్పుడు తగ్గవు.

Update: 2021-12-01 01:42 GMT

బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ధర తగ్గినా, పెరిగినా బంగారం కొనుగోళ్లు, అమ్మకాలు మాత్రం ఎప్పుడు తగ్గవు. భారత్ లోనే బంగారం పట్ల ఎక్కువ మమకారం ఉందన్నది అన్ని సర్వేల్లోనూ వెల్లడయింది. కరోనా సమయంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగినా ప్రజలు కొనకుండా ఉండలేదు. బంగారాన్ని పెట్టుబడిగా భావించే అనేకమంది మదుపు చేసుకోవడం అలవాటుగా మార్చుకున్నారు.

ఇవీ ధరలు....
బంగారం ధరలు నేడు కొంత తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర వంద రూపాయలు తగ్గి44,850లుగా ఉంది. 24 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర 110 రూపాయలు తగ్గి 48.930లుగా ఉంది. వెండి కూడా కిలోకు 1100 రూపాయలు తగ్గి ప్రస్తుం 66,500లుగా ఉంది.


Tags:    

Similar News