యాదాద్రిలో ముఖ్యమంత్రులు

ముగ్గురు ముఖ్యమంత్రులు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు

Update: 2023-01-18 06:33 GMT

ముగ్గురు ముఖ్యమంత్రులు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. మహా పూర్ఖకుంభంతో ఆలయ పండితులు వారికి స్వాగతం పలికారు. లక్ష్మీనరసింహస్వామిని ముఖ్యమంత్రులు కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ లో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రులకు ఆలయ పూజరాలు వేద ఆశీర్వచనాలను అందచేశారు. తీర్థప్రసాదాలను అందించారు. అయితే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఐ నేత డి రాజా మాత్రం ప్రెసిడెన్షియల్ సూట్ లో ఉన్నారు.


యాదాద్రి విశిష్టతను...

ప్రత్యేక హెలికాప్టర్ లో యాదాద్రికి చేరుకున్న ముఖ్యమంత్రులకు ఘన స్వాగతం లభించింది. ఈరోజు ఆలయంలో అన్ని దర్శనాలను రద్దు చేశారు. సామాన్య భక్తులకు కూడా ప్రవేశం లేదు. ముఖ్యమంత్రి యాదాద్రి ఆలయాన్ని పరిశీలిస్తున్నారు. యాదాద్రి విశిష్టతను ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి వివరించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రులు తిలకించారు. ముఖ్యమంత్రుల వెంట సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖలేయ్ యాదవ్ కూడా ఉన్నారు.


Tags:    

Similar News