నేడు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు
నేడు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఆరు స్థానాలకు స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి
నేడు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఆరు స్థానాలకు స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అధికారులు ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 12 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా ఆరు స్థానాలు ఏకగ్రీవంగా టీఆర్ఎస్ గెలుచుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒకటి, ఆదిలాబాద్ లో ఒకటి, ఖమ్మంలో ఒకటి, మెదక్ లో ఒక స్థానానికి ఎన్నిక జరగనుంది.
క్యాంపుల నుంచి....
మెదక్, ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థులు, మిగిలిన చోట్ల స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉండటంతో ఎన్నిక అనివార్యమయింది. అధికార టీఆర్ఎస్ పార్టీ తమ ఓటర్లను క్యాంపులకు తరలించి నిన్ననే హైదరాబాద్ కు తీసుకు వచ్చింది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్ర 4 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. క్యాంపుల నుంచి నేరుగా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు.