సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం రేపటి నుంచే
రేపు తెలంగాణ వ్యాప్తంగా సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభించనున్నారు;
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరస పథకాలతో జనాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేలోపుగా పథకాలతో పాటు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను ఆయన ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. మూడోసారి గెలుపు కోసం ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు తెలంగాణ వ్యాప్తంగా సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభించనున్నారు.
వారానికి ఒక రకం...
విద్యార్థులకు పాఠశాలల్లో ప్రభుత్వమే బ్రేక్ ఫాస్ట్ ను అందించనుంది. ఇందుకోసం మెనూ ను కూడా సిద్ధం చేశారు. ఏ వారం ఏ బ్రేక్ ఫాస్ట్ ను పిల్లలకు ఇవ్వాలన్నది ప్రభుత్వమే నిర్ణయించింది ప్రతి వారానికి ఒక రకమైన బ్రేక్ ఫాస్ట్ ను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏ వారం విద్యార్థులకు ఏ రకమైన బ్రేక్ ఫాస్ట్ ఇవ్వాలన్నది ముందుగానే నిర్ణయించారు.