కేసీఆర్‌ను రెండుచోట్ల ఓడిస్తారు : రేవంత్ రెడ్డి

రాబోయే ఎన్నికలలో కామారెడ్డి, గజ్వేల్‌లో పోటీ చేయబోతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంపై

Update: 2023-08-21 11:12 GMT

రాబోయే ఎన్నికలలో కామారెడ్డి, గజ్వేల్‌లో పోటీ చేయబోతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ ఓటమిని ఒప్పుకున్నారని.. తన సవాల్ స్వీకరించకుండా కేసీఆర్ పారిపోయారని విమర్శించారు. ఇంతమందిని గెలిపించిన నాయకుడు.. రెండు చోట్ల పోటీ చేయడానికి కారణమేంటని ప్రశ్నించారు. రెండుచోట్ల ఆయనను ఓడిస్తారని చెప్పారు. దీన్నిబట్టి ఎన్నికలలో కాంగ్రెస్ గెలవబోతున్నట్లు, ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని అర్ధ‌మ‌వుతుంద‌ని అన్నారు.

కాంగ్రెస్ హయాంలోనే రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. పెన్షన్‌ను రూ.75 నుంచి రూ.200 కాంగ్రెస్సే చేసిందని చెప్పారు. ఓఆర్ఆర్‌, పేదలకు ఉపయోగపడే మెట్రోను నిర్మించామన్నారు. అలాంటి కాంగ్రెస్‌ను ఏం చేసిందని ప్రశ్నిస్తారా అని అడిగారు. ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ దిట్ట అని.. 2014 ముందు ప్రతిసారి పొత్తులతోనే పోటీ చేయలేదా అని ప్రశ్నించారు.


Tags:    

Similar News