సెల్లార్ గుంత లో పడి ముగ్గురు చిన్నారుల మృతి
హైదరాబాద్ లోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో విషాదం చోటు చేసుకుంది. గుంత లో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు
హైదరాబాద్ లోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ఫేజ్ 4 లో విషాదం చోటు చేసుకుంది. సెల్లార్ గుంత లో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. నిన్న ఆడుకుంటూ వెళ్లిన ముగ్గురు చిన్నారులు సెల్లార్ గుంతలో పడి మరణించారు. సంగీత, రమ్మ, సఫియాలు ఈ సెల్లార్ గుంతలో పడి మరణించారు.
భవన నిర్మాణం కోసం....
ఒక భవన నిర్మాణం కోసం ఈ గుంతను తవ్వినట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబం ఆర్టీఏ ఆఫీసు పక్కన టీ కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తుంది. చిన్నారులు ఆడుకునే సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇప్పటికే ఈ గుంతలో పడి ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి.