నేడు ఢిల్లీకి కవిత
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు ఢిల్లీ పర్యటన చేయనున్నారు;
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు ఢిల్లీ పర్యటన చేయనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు వినిపించిన తర్వాత కవిత ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని, ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తనకు సంబంధం లేదని కవిత ఇప్పటికే పలుమార్లు చెప్పారు.
జాతీయ ఛానెళ్లతో...
తనను బీజేపీ నేతలు పార్టీలోకి ఆహ్వానించారని కూడా కవిత తెలిపారు. ఈరోజు కొన్ని జాతీయ ఛానెళ్లతో కవిత మాట్లాడే అవకాశాలున్నాయని అంటున్నారు. కవిత వెంట ఆమె న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా ఉన్నారని తెలిసింది. కవిత రాత్రికి తిరిగి ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.