నేడు టీఆర్ఎస్ మహా ధర్నా.. కేసీఆర్ తో సహా....?
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఈరోజు ఇందిరా పార్కు వద్ద టీఆర్ఎస్ మహా ధర్నా చేపడుతుంది
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఈరోజు ఇందిరా పార్కు వద్ద టీఆర్ఎస్ మహా ధర్నా చేపడుతుంది. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఈ ధర్నా జరుగుతుంది. పంజాబ్ లో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తూ తెలంగాణలో ధాన్యం కొనుగోలకు నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ ధర్నా చేస్తుంది.
గవర్నర్ వద్దకు....
నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై ప్రధాని మోదీకి లేఖ రాశారు. ధర్నాను ముగించిన అనంతరం మంత్రులతో కలసి కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు వినతి పత్రం సమర్పిస్తారు. ఈ ధర్నాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, ఎంపీలు అందరూ పాల్గొంటారని పార్టీ వర్గాలు చెప్పాయి.