టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం.. ఇకపై
ప్రశ్నాపత్రాల లీకేజీతో టీఎస్‌పీఎస్సీ అప్రమత్తమయింది. ఇకపై మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు పడుతుంది
ప్రశ్నాపత్రాల లీకేజీతో టీఎస్‌పీఎస్సీ అప్రమత్తమయింది. ఇకపై మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు పడుతుంది. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌లు నిర్వహించాలని దాదాపు నిర్ణయించింది. దీనిపై రేపు స్పష్టత రానుంది. వాయిదా పడిన, రద్దయిన పరీక్షల తేదీలను కూడా టీఎస్‌పీఎస్సీ రేపు ప్రకటించే అవకాశముంది. ప్రశ్నాపత్రాల లీకేజీతో ప్రభుత్వం సీరియస్ అయింది. పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నా ప్రభుత్వంపై బురద పడటమే కాకుండా, అభ్యర్థులు కూడా ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముప్ఫయి లక్షల మంది నిరుద్యోగులకు ఈసారి పకడ్బందీ విధానంలో పరీక్షలు నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ సమాయత్తమవుతుంది.
కంప్యూటర్ బేస్డ్...
గ్రూపు 1 ప్రిలిమనరీ పరీక్ష ను జూన్ 11వ తేదీన నిర్వహిస్తామని ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. అయితే ఏఈఈ, టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల పరీక్షలకు మాత్రం కొత్త తేదీలను రేపు ప్రకటించే అవకాశముంది. ఈ మేరకు కసరత్తులు చేస్తుంది. కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షలు నిర్వహించాలని దాదాపుగా నిర్ణయించింది. ఇప్పటి వరకూ దీనిపై సమావేశాలు నిర్వహించిన టీఎస్‌పీఎస్సీ అధికారులు రేపు వాయిదా పడిన, రద్దయిన పరీక్షల తేదీలను ప్రకటించే అవకాశముంది.