సిరిసిల్ల యువతి మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. ఏడాది క్రితమే పెళ్లి.. కానీ
చందుర్తి మండలం మూడపల్లికి చెందిన శాలిని (18) అనే యువతి మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున శాలిని అనే యువతి కిడ్నాపవ్వడం.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. యువతికోసం గాలించారు పోలీసులు. అంతలోనే ఆ యువతి ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తాను ప్రేమించిన యువకుడినే పెళ్లాడినట్లు పేర్కొంటూ ఓ వీడియోను మీడియాకు పంపింది. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న తామిద్దరం ఏడాది క్రితమే వివాహం చేసుకోగా.. అప్పటికి మైనర్లు కావడంతో ఆ వివాహం చెల్లలేదని తెలిపింది.
ఆ తర్వాత తనను ఇంటివద్దే ఉంచి, ప్రియుడిని జైలుకు పంపారని తెలిపింది. తాను ప్రేమించిన వ్యక్తి దళితుడు కావడమే అందుకు కారణమని పేర్కొంది. తెల్లవారుజామున కారులో వచ్చినపుడు ముఖానికి ముసుగు ఉండటంతో గుర్తుపట్టలేకపోయానని చెప్పింది. చందుర్తి మండలం మూడపల్లికి చెందిన శాలిని (18) అనే యువతి మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు హనుమాన్ దేవాలయానికి వెళ్లి పూజ చేసి బయటకు వస్తుండగా.. ఆలయం ముందుకి ఓ కారు వచ్చింది.
అందులో నుండి దిగిన యువకులు.. శాలినిని చుట్టుముట్టి కారులో తీసుకెళ్లిపోయారు. శాలిని వారి నుండి తప్పించుకునేందుకు తన సాయశక్తులా ప్రయత్నించింది. ఆమె తండ్రిని ఇద్దరు బంధించగా.. ఓ దుండగుడు ఆమెను వెంటాడి మరీ పట్టుకున్నాడు. యువతిని బలవంతంగా కారు ఎక్కించి.. అక్కడి నుండి పరారయ్యారు. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇప్పుడు ఇద్దరూ వివాహం చేసుకుని అందరికీ ఊహించని షాకిచ్చారు.