రాహుల్ యాత్రలోకి దూసుకొచ్చిన వ్యక్తి
రాహుల్ గాంధీ పాదయాత్ర లోకి గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ప్రవేశించాడు. అకస్మాత్తుగా వచ్చి కాళ్లపై పడటంతో అవాక్కయ్యారు
రాహుల్ గాంధీ పాదయాత్ర లోకి గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ప్రవేశించాడు. అకస్మాత్తుగా వచ్చి రాహుల్ కాళ్లపై పడటంతో అందరూ అవాక్కయ్యారు. పోలీసు వలయాన్ని ఛేధించుకుని మరీ ఆ వ్యక్తి వచ్చి రాహుల్ కాళ్లను పట్టుకున్నాడు. దీంతో కొద్దిసేపు పాదయాత్రలో అలజడి చెలరేగింది. రాహుల్ కూడా ఆశ్చర్యపోయారు. రాహుల్ గాంధీ కూడా తన వ్యక్తిగత భద్రత సిబ్బంది పైనా, పోలీసులపై అసహనం వ్యక్తం చేసినట్లు కనిపించింది.
భద్రత వైఫల్యం...
రాహుల్ గాంధీ తన పాదయాత్రలో అందరినీ కలుస్తున్నారు. ఆయనను చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు, ఆయనతో ఫొటో దిగేందుకు అనేకమంది పోటీ పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా వస్తున్న వారిని పోలీసులు అడ్డుకుని స్థానిక నేతలు వారిని గుర్తించి ఓకే చెబితేనే రాహుల్ వద్దకు అనుమతిస్తారు. అప్పడే రాహుల్ వారితో మాట్లాడతారు. కానీ అకస్మాత్తుగా ఒక వ్యక్తి దూసుకురావడంతో పాదయాత్రలో కలకలం రేగింది. భద్రత వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడింది. పెద్దషాపూర్ లో జరగాల్సిన సభను కూడా రాహుల్ రద్దు చేసుకున్నారు.