హరీశ్ రావుపై కేసు నమోదు.. ఫోన్ ట్యాపింగ్ కేసు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదయింది

Update: 2024-12-03 07:17 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై హరీశ్ రావుపై కేసు నమోదయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హరీశ్ రావుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఫోన్ ను ట్యాప్ చేశారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదుచేశారు.

ఈ సెక్షన్ల కింద...
దీంతో పంజాగుట్ట పోలీసులు హరీశ్ రావుపై 120 బి, 386, 409 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో హరీశ్ రావుతో పాటుమాజీ డీసీపీ రాధాకిషన్ రావు కూడా ఉన్నారు. ఇప్పటికే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు పై విచారణ జరుగుతుంది. అనేక మంది అరెస్టయ్యారు. కొందరిపై కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో ఫోన్ ట్యాపింగ్ కేసు హరీశ్ రావుపై నమోదయింది.


Tags:    

Similar News