Bandi Sanjay : పవన్ కామెంట్స్ పై బండి సంజయ్ ఏమన్నారంటే?
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కామెంట్స్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కామెంట్స్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. పవన్‌కు రేవంత్ ఏ విషయంలో గొప్పగా కనిపించారని ప్రశ్నించారు.ఆరు గ్యారంటీలని పక్కదారి పట్టించాలని చూస్తున్నారని బండి సంజయ్ తెలిపారు. అల్లు అర్జున్, రేవంత్‌కి ఎక్కడ చెడిందోనని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.పుష్ప-3 రిలీజ్‌కు ముందే అల్లు అర్జున్‌కి రేవంత్‌రెడ్డి సినిమా చూపించారని, 14శాతం కమీషన్ దగ్గర చెడిందేమో అని బండి సంజయ్ సెటైర్ వేశారు.
కమీషన్లు వసూలు చేస్తూ...
ముగ్గురు మంత్రులు కమీషన్లు వసూలు చేస్తున్నారని బండి సంజయ్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. సచివాలయం, మంత్రుల పేషీలు కమీషన్లకు అడ్డాగా మారాయన్న బండి సంజయ్ ఇక్కడి కమీషన్లతో ఢిల్లీకి కప్పం కడుతున్నారని తెలిపారు. మంత్రులందరికీ సీఎం కావాలని ఉందని, ఢిల్లీకి డబ్బులు పంపడం వల్లే సీఎం పదవి నిలబడుతోందని కేంద్రసహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now