నేడు తెలంగాణకు నిర్మలా సీతారామన్

కామారెడ్డి జిల్లాలో నేడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించనున్నారు.;

Update: 2022-09-01 03:12 GMT
నేడు తెలంగాణకు నిర్మలా సీతారామన్
  • whatsapp icon

ప్రజల్లోకి భారతీయ జనతా పార్టీని మరింత బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో జిల్లాల వారీగా కొందరికి బాధ్యతలను అప్పగించారు. ఆ యా జిల్లాల్లో పర్యటించి బీజేపీని బలోపేతం చేయాల్సిన బాధ్యతను వారికి అప్పగించారు. కామారెడ్డి జిల్లాలో నేడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించనున్నారు.

మూడు రోజుల పర్యటన....
ఇందులో భాగంగా మూడు రోజుల పాటు జిల్లాలో కేంద్ర మంత్రి పర్యటన ఉండనుంది. కేంద్ర ప్రభుత్వం పథకం అమలు చేస్తున్న పథకాలపై నియోజకవర్గంలోని కార్యకర్తలతో నిర్మలా సీతారామన్ భేటీ కానున్నారు. నిర్మలా సీతారామన్ మూడు రోజుల పర్యటనకు సంబంధించి పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.


Tags:    

Similar News