నేటి నుంచి తెలంగాణలో పెరగనున్న భూముల విలువ

నేటి నుంచి తెలంగాణలో భూముల విలువ పెరిగింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2022-02-01 03:41 GMT

నేటి నుంచి తెలంగాణలో భూముల విలువ పెరిగింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో ఉన్న వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువను పెంచుతూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చెల్లించిన వారికి కొత్త ఛార్జిల నుంచి మినహాయింపు లభిస్తుంది. తెలంగాణలోని 141 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నేటి నుంచి కొత్త ఛార్జీలు అమలులోకి రానున్నాయి.

భూముల మార్కెట్ విలువ....
నూతనంగా వెలువడిన ఉత్తర్వుల ప్రకారం వ్యవసాయ భూముల మార్కెట్ విలువలో యాభై శాతం, అపార్ట్ మెంట్ల విషయంలో 35 శాతం ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూముల విలువ పెరుగుతాయని తెలిసి గత కొద్ది రోజులుగా భూముల రిజిస్ట్రేషన్లు జోరుగా జరుగుతున్నాయి.


Tags:    

Similar News