Breaking : కవితకు కు షాక్ ఇచ్చిన హైకోర్టు... బెయిల్ నిరాకరణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటీషన్ పై నేడు తీర్పు వెలువడింది.

Update: 2024-07-01 11:42 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటీషన్ పై నేడు తీర్పు వెలువడింది. బెయిల్ ను నిరాకరిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ట్రయల్ కోర్టు తనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో కవిత తరుపున న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కవిత బెయిల్ పిటీషన్ పై మే28న విచారణ పూర్తయింది. తీర్పును రిజర్వ్ చేసింది. నేడు తీర్పు వెలువరించనుంది.

తనకు బెయిల్ ఇవ్వాలని...
తాను శాసనమండలి సభ్యురాలిగా ఉన్నందున తనకు బెయిల్ ఇవ్వాలని ఆమె హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు కూడా కవిత బెయిల్ ను తిరస్కరించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవిత మూడున్నర నెలల నుంచి తీహార్ జైలులో ఉన్నారు. ఈ ఏడాది మార్చి 15వ తేదీన కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. కవిత వేసిన రెండు బెయిల్ పిటీషన్లను హైకోర్టు తిరస్కరించింది


Tags:    

Similar News