పొంచి ఉన్న ప్రమాదం
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా భారీగా ఎక్కడ పడితే
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా భారీగా ఎక్కడ పడితే అక్కడ నీరు ఉండిపోయాయి. చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పుడు మరో ప్రమాదం పొంచి ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఆదివారం, సోమవారం అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. శుక్రవారం ఒడిశా తీరం, పరిసర ప్రాంతంలో ఉన్న అల్పపీడనం వాయవ్య బంగాళాఖాతంలోని ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరంలో కొనసాగుతుందని.. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వరద ప్రాంతాల్లో ఆదివారం ఏరియల్ సర్వే చేపట్టనున్న సీఎం కేసీఆర్ శనివారం సాయంత్రం వరంగల్‌కు రానున్నారు. రోడ్డు మార్గంలో ఆయన వరంగల్ వస్తారు. పార్లమెంటరీ పార్టీ నేతలతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన వరంగల్ బయలుదేరుతారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులతోనూ సమావేశం కానున్నారు. కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో రాత్రి బస చేస్తారు. ఆదివారం ఉదయం వరగంల్ ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ నుంచి ఏరియల్ సర్వేకు బయలుదేరుతారు.