నేటి నుండి తెలంగాణలో వాతావరణం ఎలా ఉండబోతోందంటే?

తెలంగాణలో ఉదయం, రాత్రి సమయాల్లో చల్లగాలులు వీస్తున్నా.. పగటి పూట మాత్రం

Update: 2024-02-28 03:03 GMT

Weather Update:తెలంగాణలో ఉదయం, రాత్రి సమయాల్లో చల్లగాలులు వీస్తున్నా.. పగటి పూట మాత్రం వేడి చాలా ఎక్కువగా ఉంటోంది. ఎండాకాలం తలపిస్తోంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. బుధవారం నుంచి ఎండల తీవ్రత మరింత పెరిగిపోనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేటి నుండి సాధార‌ణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రలు పెర‌గ‌నున్ననట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

హైదరాబాద్ నగరంలో 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం నగరవాసులను భయపెడుతోంది. వేసవి కాలం పూర్తిగా ప్రారంభం కాకముందే ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్‌ నగరంలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని
మెట్రోలాజికల్ డిపార్ట్ మెంట్
వెల్లడించింది. హైదరాబాద్ లో నేడు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 21 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 8 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో దక్షిణ, నైరుతి దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 30.9 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 20.7 డిగ్రీలుగా నమోదైంది. 72 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది. మార్చి రెండో వారం నుంచి కొంత విచిత్ర వాతావరణ పరిస్థులు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఓవైపు ఉష్ణోగ్రత‌లు పెరుగుతాయని.. మ‌రోవైపు తేలిక‌పాటి నుంచి మోస్తరు వ‌ర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


Tags:    

Similar News