సీఎం కేసీఆర్ మేడారానికి వెళ్లేనా ? సందిగ్ధంలో మంత్రులు !

నిజానికి షెడ్యూల్ ప్రకారం ఉదయం 11.40 గంటలకే కేసీఆర్ మేడారానికి చేరుకోవాల్సి ఉంది. సీఎం రాకకోసం అధికారులు, మంత్రులు కూడా

Update: 2022-02-18 10:16 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కుటుంబ సమేతంగా మేడారంకు విచ్చేసి, వనదేవతలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకోనున్నారని వారంరోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ రోజు ఉదయం కూడా కేసీఆర్ మేడారంకు వస్తున్నట్లు వార్తలొచ్చాయి. నిజానికి షెడ్యూల్ ప్రకారం ఉదయం 11.40 గంటలకే కేసీఆర్ మేడారానికి చేరుకోవాల్సి ఉంది. సీఎం రాకకోసం అధికారులు, మంత్రులు కూడా తగుఏర్పాట్లు చేసి, ఎదురుచూస్తున్నారు.

కానీ.. ఇంతవరకూ సీఎం కేసీఆర్ మేడారానికి చేరుకోకపోవడంపై గందరగోళం నెలకొంది. కేసీఆర్ రాకపై మంత్రులకు సైతం సమాచారం లేకపోవడంతో సందిగ్ధత నెలకొంది. సీఎం మేడారం పర్యటన షెడ్యూల్ లో ఏవైనా మార్పులుంటే ఈ పాటికే ఆ సమాచారం మంత్రులకు చేరేది. కానీ.. వాళ్లకు కూడా ఏమీ తెలియకపోవడంతో సీఎం రాకపై సందిగ్ధత నెలకొంది. కాగా.. మేడారం మహాజాతర మూడో రోజుకు చేరుకుంది. వనదేవతలకు భక్తులు బంగారం(బెల్లం) సారె పెట్టి, మొక్కులు చెల్లించుకుంటున్నారు. తొలిరోజు సారలమ్మ, పగిడి గద్దరాజు, గోవింద రాజు, రెండవ రోజు సమ్మక్క గద్దెలపై ఆసీనులై.. భక్తులకు ఆశీర్వచనం ఇస్తున్నారు.




Tags:    

Similar News