పోలీసు ఉద్యోగం కోసం.. ఎత్తు పెరగడానికి ఎత్తుగడ

పోలీసు ఉద్యోగం కోసం ఒక మహిళ అభ్యర్థి తన జుట్టులో ఎం సీల్ ముక్కను అతికించుకుని ఎత్తును పెంచుకునే ప్రయత్నం చేసింది

Update: 2022-12-14 12:24 GMT

పోలీసు ఉద్యోగం సంపాదించాలన్న ఉద్దేశ్యంతో అడ్డుదారి తొక్కింది ఒక యువతి. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. రాష్ట్ర పోలీసు కానిస్టేబుల్, సబ్ ఇన్స్‌పెక్టర్ల ఉద్యోగాల కోసం ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో ఎత్తుతో పాటు దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. అయితే తన ఎత్తు తక్కువగా ఉండటంతో ఒక మహిళ అభ్యర్థి తన జుట్టులో ఎం సీల్ ముక్కను అతికించుకుని ఎత్తును పెంచే ప్రయత్నం చేసింది.

అనర్హత వేటు...
మహబూబ్ నగర్ ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు కథనం ప్రకారం ఎలక్ట్రానిక్ ఎత్తును కొలిచే పరికరంపై ఒక మహిళ అభ్యర్థి నిల్చున్న వెంటనే ఆ పరికరం నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదన్నారు. దీంతో ఎత్తును పరీక్షించే అధికారికి అనుమానం వచ్చి అభ్యర్థి తలను పరిశీలించారు. ఎత్తు పెరగడానికి ఆమె తన తల వెంట్రుకల కింద ఎంసీల్ మైనాన్ని అతికించినట్లు నిర్థారణ అయింది. దీంతో అధికారులను మోసం చేశారన్న ఆరోపణపై ఆ అభ్యర్థిపై అనర్హత వేటు వేశారు.


Tags:    

Similar News