Free Bus : తెలంగాణలో నేటి నుంచి జీరో టిక్కెట్.. మహిళలూ తీసుకోవాల్సిందే

తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో నేటి నుంచి మహిళలు జీరో టిక్కెట్ తీసుకోవాల్సి ఉంటుంది. గుర్తింపు కార్డు చూపాల్సి ఉంటుంది.

Update: 2023-12-15 02:46 GMT

 Tsrtc zero ticket

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు గ్యారంటీలను అమలు చేసింది. అందులో భాగంగా మహాలక్ష్మి పధకం కింద రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ ఈ నెల 9వ తేదీ నుంచి ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తొలి వారం రోజులు ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండా ప్రయాణించవచ్చని పేర్కొంది. తర్వాత మాత్రం తెలంగాణకు చెందిన వారుగా గుర్తింపు కార్డును కండక్టర్ కు చూపాల్సి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

గుర్తింపు కార్డు చూపి...
ఇతర రాష్ట్రాల మహిళలకు ఈ పథకం వర్తించదు. దీంతో ఈరోజు నుంచి ఖచ్చితంగా ఉచితంగా బస్సులో ప్రయాణించే మహిళలు తమ గుర్తింపు కార్డును చూపించాలి. అంతేకాకుండా జీరో టిక్కెట్ ను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మహిళలకు ఉచిత బస్సు పథకం అమలులోకి వచ్చిన తర్వాత ఆక్యుపెన్సీ రేటు బాగా పెరిగింది. మహిళలు ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ సిబ్బందికి సెలవులు కూడా రద్దు చేశారంటే బస్సుల్లో ఏ మాత్రం రద్దీ ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.


Tags:    

Similar News