నేడు ఎస్సై ఉద్యోగానికి రాత పరీక్ష
నేడు ఎస్సై ఉద్యోగానికి రాత పరీక్ష జరగనుంది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామకమండలి ఈ పరీక్షకుఅన్ని ఏర్పాట్లు చేసింది
నేడు ఎస్సై ఉద్యోగానికి రాత పరీక్ష జరగనుంది. తెలంగాఱ రాష్ట్ర స్థాయి పోలీసు నియామకమండలి ఈ ప్రాధమిక పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 554 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు 2,47,217 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈరోజు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 538 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
30 శాతం మార్కులు...
అయితే ఈసారి తొలిసారి రాత పరీక్ష అర్హత మార్కులను కుదించారు. గతంలో సామాజికవర్గాల వారీగా మార్కులుండేవి. ఈసారి మాత్రం వాటితో సంబంధం లేకుండా 30 శాతం మార్కులనే అర్హతగా తీసుకున్నారు. అబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నాపత్రం ఉంటుంది. వీటిలో ముప్పయి శాతం మార్కులు సాధిస్తే పరీక్ష పాస్ అయినట్లేనని అధికారులు చెబుతున్నారు.