వైఎస్ ను కాంగ్రెస్ విస్మరించింది

తెలంగాణలో ప్రజాసమస్యల పరిష్కారం కోసం 1,500 కిలోమీటర్ల పాదయాత్ర చేశానని వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల అన్నారు.

Update: 2022-07-08 10:05 GMT

తెలంగాణలో ప్రజాసమస్యల పరిష్కారం కోసం 1,500 కిలోమీటర్ల పాదయాత్ర చేశానని వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల అన్నారు. సమస్యలను ఎత్తి చూపడానికే పాదయాత్ర చేపట్టానని తెలిపారు. పాదయాత్ర ద్వారా ఎందరినో కలుసుకున్నానని, సమస్యలను తెలుసుకున్నానని చెప్పారు. వైఎస్సార్టీ నిరుద్యోగ సమస్యను ఎత్తి చూపే వరకూ ఈ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. నిరుద్యోగుల కోసం ఈరోజు వరకూ పోరాటం చేస్తూన్నే ఉన్నామని చెప్పారు.

రోశయ్య ఇచ్చిన స్థలాన్ని...
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇప్పటికీ తెలంగాణ ప్రజల్లో గుండెల్లో నిలిచి ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీని వైఎస్ రెండు సార్లు అధికారంలోకి తెచ్చారన్నారు. అలాంటి వైఎస్ కు కాంగ్రెస్ చేసిందేమిని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. వైఎస్ ఒక మెమోరియల్ కూడా లేకపోవడం దురదృష్టకరమని చెప్పారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థలం కేటాయించేందుకు ఒప్పుకున్నారని, ఆ తర్వాత ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదన్నారు. హైదరాబాద్ లో వైఎస్ ను స్మరించుకోడానికి ఒక్క మెమోరియల్ కూడా లేదు.
కేసీఆర్ ఏం చేశారు?
దానిని పక్కన పెడితే వైఎస్ పేరును ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టిందని, ఆరోజు నుంచే కాంగ్రెస్ పతనమయిందని వైఎస్ షర్మిల చెప్పారు. వైఎస్ కు కేసీఆర్ కూడా చేసిందేమీ లేదన్నారు. వైఎస్ తెలంగాణకు అనుకూలంగా సంతకాలు పెట్టించి పార్టీ హైకమాండ్ కు పంపించారన్నారు. కేసీఆర్ ను కేంద్రమంత్రిని చేసి వైఎస్ కాదా? అని షర్మిల ప్రశ్నించారు. వైఎస్ మెమోరియల్ కు కేటాయించిన స్థలాన్ని కేసీఆర్ వెనక్కు తీసుకున్నది నిజం కాదా? అని షర్మిల నిలదీశారు.


Tags:    

Similar News