ఈ దోపిడీకి హద్దుల్లేవ్

గత ప్రభుత్వం రాజధాని అమరావతిలో భూ వ్యాపారం చేసిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి తెలిపారు. రాజధాని ప్రాంతంలోని 1646ఎకరాల భూమిని 125 సంస్థలకు [more]

Update: 2020-01-20 07:38 GMT

గత ప్రభుత్వం రాజధాని అమరావతిలో భూ వ్యాపారం చేసిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి తెలిపారు. రాజధాని ప్రాంతంలోని 1646ఎకరాల భూమిని 125 సంస్థలకు కేటాయించారన్నారు. ప్రభుత్వ శాఖలకు ఓ ధరకు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు మరో ధరకు భూములు కేటాయించారని చెప్పారు. ఎన్ఐడీ కి 50ఎకరాలు, పోస్టల్ శాఖకు 5.50ఎకరాలను ఎకరాకుకోటి చొప్పున 60 ఏళ్ల లీజుకు ఇచ్చారని బుగ్గన తెలిపారు. సీఏజీకి 17ఎకరాలు, సీబీఐకి 3.50 ఎకరాలు కోటి, ఐఎండీకి ఎకరం, విదేశాంగ శాఖకు రెండెకరాలు, ఆర్మీ కి 2 ఎకరాలు, రైల్ టెల్ కి నాలుగు కోట్లు, స్కౌట్స్ అండ్ గైడ్స్ 7ఎకరాలు కోటి చొప్పున 60 ఏళ్లకు లీజు కు ఇచ్చారని తెలిపారు. ఎస్బీఐకి 3.3 ఎకరాలు నాలుగు కోట్లకు, ఎఫ్.సి.ఐకు నాలుగు కోట్లు, న్యూ ఇండియా అస్యూరెన్సు , రైల్ ఇండియా టెక్, హడ్కో రీజినల్, సిండికేట్ బాంక్, కెనరా బాంక్, ఆంధ్ర బాంక్, గెయిల్ లకి ఎకరా నాలుగు కోట్ల చొప్పున విక్రయించారని చెప్పారు.

తమకు నచ్చిన వాళ్లకు…..

విట్ విద్యాసంస్థకు కు 200ఎకరాలు ఎకరా 50లక్షల చొప్పున, ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి 200 ఎకరాలు 50లక్షల చొప్పున, అమృత యూనివర్సిటీకి 200 ఎకరాలు, ఇండో యూకే సంస్థకు 150ఎకరాలు 50 లక్షలకు విక్రయించారన్నారు. బిఆర్ఎస్ మెడిసిటీ కి 150 ఎకరాలు 50లక్షలకు కట్టబెట్టారని తెలిపారు. ఆర్మీ, నేవీలకు 60 ఏళ్ల పాటు భూములు లీజుకిచ్చి, వరుణ్ హాస్పిటాలిటీ 4 ఎకరాలు, మహా లక్ష్మీ ఇన్ఫ్రా 4 ఎకరాలు కోటిన్నర చొప్పున కేటాయించారని తెలిపారు. వరుణ్ డేవేలపర్స్, కోస్తా మెరినా, ఫార్చ్యూన్ మురళి సంస్థలకు కన్వెన్షన్ సెంటర్ ల కోసం 5 ఎకరాల చొప్పున కేటాయింపులు చేశారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు భూములు లీజుకు ఇచ్చి నచ్చిన వాళ్ళకి భూములు తక్కువ ధరకు అమ్మేశారని బుగ్గన ఆరోపించారు.

Tags:    

Similar News