కరోనా కల్లోలం.. 338 మంది వైద్యులకు పాజిటివ్ !
ఓవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ కేసులతో.. ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా
దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఓవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ కేసులతో.. ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ముంబైలో కోవిడ్, ఒమిక్రాన్ ల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే అక్కడ 36 వేల 265 కేసులు నమోదవ్వగా.. ఒక్క ముంబైలోనే 20 వేలకు పైగా పాజిటివ్ కేసులున్నాయి. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. బాధితులకు చికిత్స చేస్తున్న వైద్యులు సైతం పెద్ద సంఖ్యలో కోవిడ్ బారిన పడుతున్నారు.
Also Read : ఒమిక్రాన్ డేంజరస్..డబ్ల్యూహెచ్ఓ తాజా వార్నింగ్
మహారాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 338 మంది రెసిడెంట్ వైద్యులు కరోనా బారిన పడగా.. ఒక్క ముంబైలోనే 230 మంది వైద్యులకు కోవిడ్ సోకింది. దీంతో స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు భారత్ లో ఒమిక్రాన్ రూపంలో థర్డ్ వేవ్ మొదలైంది. దేశంలో 2,630 ఒమిక్రాన్ కేసులు ఉండగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3 లక్షలకు చేరువలో ఉన్నాయి. వచ్చే నాలుగు వారాలు చాలా కీలకమని, ఈ నాలుగు వారాల్లోనే కరోనా రెచ్చిపోతుందంటూ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫిబ్రవరి మూడో వారం వచ్చేసరికి కోవిడ్ కాస్త తగ్గుముఖం పట్టవచ్చని, అప్పటివరకూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.