డ్రాగన్ కంట్రీలో కరోనా ప్రళయం.. ఒక్కరోజే 3.7 కోట్ల మందికి పాజిటివ్

శుక్రవారం చైనా నేషనల్ హెల్త్ కమిషన్ అంతర్గతంగా సమావేశమైంది. ఈ సమావేశంలో విస్తుపోయే విషయాలతో పాటు..

Update: 2022-12-24 04:13 GMT

3.7 crore covid cases in a day

కరోనా దెబ్బకు చైనా మళ్లీ విలవిల్లాడుతోంది. మృత్యు ఘంటికలు మోగిస్తూ.. చెలరేగిపోతూ.. ప్రళయం సృష్టిస్తోన్న మహమ్మారి బారి నుండి తప్పించుకునేందుకు వీల్లేని పరిస్థితి నెలకొంది. కనీవినీ ఎరుగని రీతిలో చైనాలో కరోనా కేసులు నమోదవుతుండగా.. అక్కడి పాజిటివ్ కేసుల సంఖ్య చూసి ప్రపంచ దేశాలు బెంబేలెత్తి పోతున్నాయి. ఒకరకంగా డ్రాగన్ కంట్రీ ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉందని చెప్పాలి. ఈ నెలలో తొలి 20 రోజుల్లో దాదాపు 24.8 కోట్ల మందికి వైరస్ సోకింది. అంటే చైనా మొత్తం జనాభాలో 18 శాతం మందికి వైరస్ సోకింది.

శుక్రవారం చైనా నేషనల్ హెల్త్ కమిషన్ అంతర్గతంగా సమావేశమైంది. ఈ సమావేశంలో విస్తుపోయే విషయాలతో పాటు.. దిగ్భ్రాంతికి గురి చేసే ఓ విషయం బయటికొచ్చింది. ఈ వారంలో ఒకే రోజున 3.7 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు. జనవరి 19న చైనాలో అత్యధికంగా ఒక్కరోజులో 40 లక్షల కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ సంఖ్య కోట్లకు చేరుకుంది. ప్రపంచంలో ఈ స్థాయిలో ఎక్కడా ఒకేరోజు ఇన్నికేసులు నమోదు కాలేదు. ఈ విషయం చైనాలో వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో అద్దం పడుతోంది.
చైనాలో కరోనా కేసులు పెరిగిపోవడంతో.. భారత్ అప్రమత్తమైంది. రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. మళ్లీ మాస్కులు, శానిటైజర్లను తప్పనిసరిగా వాడాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. అన్ని ఎయిర్ పోర్టులలో కరోనా టెస్టులును తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇటీవల చైనా నుండి గుజరాత్ కు వచ్చిన ఓ వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ గా తేలడంతో ఆ రాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది.


Tags:    

Similar News