ఘోర ప్రమాదం.. 49 మంది మృతి, 40 మందికి తీవ్రగాయాలు

శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 49 మంది అక్కడికక్కడే మృతి చెందారు.

Update: 2021-12-10 04:35 GMT

శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో డజన్ల మంది మృత్యువాత పడిన దుర్ఘటన మెక్సికోలో వెలుగుచూసింది. వలసదారులతో వెళ్తున్న ట్రక్ అదుపు తప్పి బోల్తా పడటంతో.. ట్రక్ లో ఉన్న కూలీల్లో 49 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 40 మంది వలసదారులు తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ రాష్ట్రమైన చియపాస్ లో జరిగిన ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయ చర్యలు చేపట్టారు.

వలసదారులతో...
అధికారులు చెప్పిన వివరాల మేరకు సుమారు 100 మంది వలసదారులతో వెళ్తున్న ట్రక్ అదుపుతప్పి రిటైనింగ్ గోడను ఢీ కొట్టడంతో.. ఈ ఘోర ప్రమాదం జరిగింది. పదుల సంఖ్యలో పడి ఉన్న మృతదేహాలు స్థానికులను తీవ్రంగా కలచివేశాయి. మృతులు, క్షతగాత్రులంతా వలస కార్మికులని, సరైన ధృవపత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాకు వెళ్తున్నట్లు స్థానిక ప్రాసిక్యూటర్ కార్యాలయం ప్రకటించింది. ఈ ప్రమాదంలో గాయపడిన 40 మందిలో.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర గవర్నర్ రుటిలియో ఎస్కాండన్ సంతాపం తెలిపారు.


Tags:    

Similar News