బెజవాడ కోవిడ్ సెంటర్ లో భారీ అగ్నిప్రమాదం ముగ్గురి మృతి

విజయవాడలోని ఒక కోవిడ్ సెంటర్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ ను ప్రభుత్వం కోవిడ్ సెంటర్ గా ఉపయోగిస్తుంది. అయితే షార్ట్ [more]

Update: 2020-08-09 02:10 GMT

విజయవాడలోని ఒక కోవిడ్ సెంటర్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ ను ప్రభుత్వం కోవిడ్ సెంటర్ గా ఉపయోగిస్తుంది. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా తెల్లవారుజామున పెద్దయెత్తున మంటలు చెలరేగాయి. దాదాపు యాభై మంది కరోనా పేషెంట్లు ఇందులో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కరోనా రోగులను తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటన స్థలికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News