యూపీలో ఘోర ప్రమాదం .. 20 మంది మృతి
ఉత్తర్‌ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. యమునా నదిలో పడవ బోల్తాపడి ఇరవై మంది మరణించారు.
ఉత్తర్‌ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. యమునా నదిలో పడవ బోల్తాపడి ఇరవై మంది మరణించారు. ప్రమాద సమయంలో పడవలో ముప్ఫయి నుంచి యాభై మంది ప్రయాణికులు ఉన్నారు. బరువు ఎక్కువ కావడంతో పడవ బోల్తా పడింది. బాందా దగ్గర ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బందా ఘాట్ నుంచి ఫతేపూర్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరంతా రాఖీ పండగ కోసం సొంత ఊళ్లకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నట్లు సమాచారం.
గాలింపు చర్యలు...
యమునా నదిలో పడవ పూర్తిగా మునిగిపోయింది. యాభై మంది గల్లంతయినట్లు సమాచారం. అయితే రెస్క్యూ టీం చాలా మందిని రక్షించారు. మర్కా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పటి వరకూ నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. సామర్థ్యానికి మించి పడవలో ప్రయాణికులను ఎక్కించుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గాలింపు చర్యలను ముమ్మరంగా చేపట్టారు.