త్వరలో నాపై క్రిమినల్ కేసు.. ఏబీ వెల్లడి
ప్రభుత్వం తనను వేధిస్తుందని మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కు లేఖ రాశారు. త్వరలో తనపై క్రిమినల్ కేసు పెట్టబోతుందని ఆయన [more]
ప్రభుత్వం తనను వేధిస్తుందని మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కు లేఖ రాశారు. త్వరలో తనపై క్రిమినల్ కేసు పెట్టబోతుందని ఆయన [more]
ప్రభుత్వం తనను వేధిస్తుందని మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కు లేఖ రాశారు. త్వరలో తనపై క్రిమినల్ కేసు పెట్టబోతుందని ఆయన రాసిన లేఖలో పేర్కొన్నారు. క్రిమినల్ కేసు తనపై పెట్టి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. తద్వారా తనపై తిరిగి సస్పెన్షన్ విధించే అవకాశం ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే తనకు నెలల తరబడి జీతం ఇవ్వకుండా ఏపీ ప్రభుత్వం వేదిస్తుందని, ఎలాంటి కారణాలు లేకుండా తనను ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు. హైకోర్టు తనపై సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పినా ప్రభుత్వం సుప్రీంకోర్టు కెళ్లి స్టే ఆర్డర్ తెచ్చిందని చెప్పారు. దీనిపై అసోసియేషన్ తరుపున చర్యలు తీసుకుని తనకు సహకరించాలని ఏబీ వెంకటేశ్వరరావు కోరారు.