ఏబీపై శాఖాపరమైన విచారణ

ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై శాఖాపరమైన విచారణ జరగనుంది. ఈ నెల 18వ తేదీ నుంచి విచారణ ప్రారంభం కానుంది. సాక్షులగా మాజీ డీజీపీలు [more]

Update: 2021-03-16 00:43 GMT

ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై శాఖాపరమైన విచారణ జరగనుంది. ఈ నెల 18వ తేదీ నుంచి విచారణ ప్రారంభం కానుంది. సాక్షులగా మాజీ డీజీపీలు రాముడు, సాంబశివరావు, మాలకొండయ్య, ఆర్పీ ఠాకూర్ లు ఉన్నారు. వీరందరూ ఈ నెల 18వ తేదీన జరిగే విచారణకు హాజరు కావాలని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ నోటీసులు పంపింది. విచారణను త్వరగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి రోజు వారీ విచారణ చేపట్టనున్నారు.

Tags:    

Similar News