క్యాట్ ను ఆశ్రయిచిన ఏబీ

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తన సస్పెన్షన్ ను సవాలు చేస్తూ క్యాట్ లో పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాదులోని కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ లో [more]

Update: 2020-02-13 11:17 GMT

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తన సస్పెన్షన్ ను సవాలు చేస్తూ క్యాట్ లో పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాదులోని కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ లో ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసినట్లు ఏబీ వెంకటేశ్వర్రావు తరఫు న్యాయవాది వెల్లడించారు. ప్రభుత్వం చేసిన సస్పెన్షన్ ను క్యాట్ లో సవాల్ చేశారు. తనపై నిరాధారమైన ఆరోపణలతో ప్రభుత్వం సస్పెండ్ చేసిందని, ఈ సస్పెన్షన్ ను వెంటనే కొట్టివేయాలని ఏ బీ వెంకటేశ్వరరావు పిటిషన్ లో కోరారు. కొన్ని రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే తనను ప్రభుత్వం సస్పెండ్ చేసిందని, గత ఏడాది మే నుంచి తనకు ప్రభుత్వం జీతం కూడా చెల్లించడం లేదని పేర్కొన్నాడు. ఏబీ వెంకటేశ్వరరావు వేసిన స్వీకరించి తదుపరి విచారణ చేస్తున్నట్లు క్యాట్ తెలిపింది.

Tags:    

Similar News