కొత్త గవర్నర్.. గవర్నమెంట్‌కు సవాలేనా?

కర్ణాటకలోని కెనరా ప్రాంతానికి చెందిన అబ్దుల్ నజీర్ ను ఏరి కోరి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా నియమించింది

Update: 2023-02-12 05:09 GMT

ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ నియమితులయ్యారు. పొరుగున ఉన్న కర్ణాటకకు చెందిన అబ్దుల్ నజీర్ న్యాయవాది వృత్తిని అభ్యసించి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా వ్యవహరించారు. కర్ణాటకలోని కెనరా ప్రాంతానికి చెందిన అబ్దుల్ నజీర్ ను ఏరి కోరి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా నియమించింది. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతుండటంతో ఆయన నియామకం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా...
2017లోనే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అదే ఏడాది వివాదాస్పద ట్రిపుల్ తలాక్ కేసును విచారించిన బెంచ్ లో అబ్దుల్ నజీర్ ఒకరు. బిశ్వభూషణ్ హరిచందన్ కూడా ఈ ఏడాది ఎన్నికలకు జరిగే ఛత్తీస్‌ఘడ్ గవర్నర్ గా నియమితులయ్యారు. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరుగుతుండటంతో గవర్నర్ నియామకంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తారా? లేదా? అన్న చర్చ జరుగుతుంది.
మూడు రాజధానులు...
ఏపీలో పరిస్థితులను చక్కదిద్దడానికి గవర్నర్ ప్రయత్నిస్తారని, స్వతహాగా రిటైర్డ్ న్యాయమూర్తి కావడంతో న్యాయపరమైన ఆలోచనలు చేస్తారని, ప్రభుత్వానికి కూడా ఇబ్బందిగా మారనుందన్న అంచనాలు మాత్రం వినపడుతున్నాయి. మూడు రాజధానుల బిల్లును తిరిగి ప్రవేశ పెట్టనున్న సమయంలో గవర్నర్ మార్పిడి అధికార పార్టకి తలనొప్పిగా మారనుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా గవర్నర్ దృష్టి పెట్టే అవకాశముందంటున్నారు.



Tags:    

Similar News