ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ కస్టడీకి అనుమతి
ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ కోర్టు కస్టడీకి అనుమతించింది. నాలుగు రోజుల పాటు ఆయనను విచారించడానికి అనుమతి ఇచ్చింది. అయితే న్యాయవాది సమక్షంలోనే ధూళిపాళ్ల నరేంద్ర ను విచారించాలని [more]
ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ కోర్టు కస్టడీకి అనుమతించింది. నాలుగు రోజుల పాటు ఆయనను విచారించడానికి అనుమతి ఇచ్చింది. అయితే న్యాయవాది సమక్షంలోనే ధూళిపాళ్ల నరేంద్ర ను విచారించాలని [more]
ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ కోర్టు కస్టడీకి అనుమతించింది. నాలుగు రోజుల పాటు ఆయనను విచారించడానికి అనుమతి ఇచ్చింది. అయితే న్యాయవాది సమక్షంలోనే ధూళిపాళ్ల నరేంద్ర ను విచారించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్ పిటీషన్ ను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. అలాగే ఏసీబీ వేసిన కస్టడీ పిటీషన్ ను కూడా వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ప్రస్తుతం సంగం డెయిరీ ప్రభుత్వం ఆధీనంలో ఉందని, ఇక ఎందుకు కస్టడీకి ధూళిపాళ్ల అవసరమని ఆయన తరుపున న్యాయవాది అన్నారు. ధూళిపాళ్ల నరేంద్ర తన సొంత ప్రయోజనాల కోసం ఏమీ చేయలేదని, పాడి రైతుల అభివృద్ది కోసమే పనిచేశారని చెప్పారు. వాదనలను విన్న ఏసీబీ కోర్టు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది