ఉపాధి పేరుతో తీసుకు వచ్చి… వ్యభిచార కూపంలోకి

ఆన్ లైన్ లో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. భీమవరం చెందిన వంశీ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ [more]

Update: 2020-07-30 02:13 GMT

ఆన్ లైన్ లో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. భీమవరం చెందిన వంశీ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో చిన్నా తో పాటు, అంజలి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్ కు సంబంధించి ఎస్ ఓ టి పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో నేరేడ్ మెట్ ప్రాంతాల్లో ఉన్న వ్యభిచార గృహంపై ఎస్ ఓ టి దాడి చేశారు. ఈ దాడులలో మొత్తం నలుగురు అమ్మాయిలను పోలీసులు రెస్క్యూ చేశారు. రెస్క్యూ చేసిన అమ్మాయిలందరూ కూడా మహిళా వసతి గృహానికి తరలించారు. అయితే ఇతర ప్రాంతాల్లో ఉన్న అమ్మాయిల్ని ఉపాధి పేరుతో అంజలి హైదరాబాద్ తీసుకు వస్తుంది. ఉపాధి పేరుతోటి మహిళలను అంజలి ట్రాప్ చేస్తుందని పోలీసులు వెల్లడించారు.

హైదరాబాద్ కు తీసుకొచ్చి…..

హైదరాబాద్ తీసుకు వచ్చిన తర్వాత చిన్నా, వంశీ రెడ్డిలకు అమ్మాయిలను అప్పగిస్తుంది. అంజలి వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో అమౌంట్ వసూలు చేస్తుంది. ఆ తర్వాత మరికొందరు అమ్మాయిలకు గాలం వేసి వీళ్లకు అప్పగించే పనిలో పడి పోతుంది. అయితే ఇప్పటివరకు ఇతర ప్రాంతాల్లో ఉన్న అమ్మాయిలని ఉపాధి పేరుతో హైదరాబాద్ వచ్చి బలవంతంగా వ్యభిచారంలోకి దింపినట్లుగా పోలీసుల విచారణలో వెలుగుచూసింది. ప్రస్తుతానికి వంశీ రెడ్డి ని అధికారులు పట్టుకోగా, చిన్నా, అంజలి పరారీలో ఉన్నారని వీళ్లు ను కూడా త్వరలోనే పట్టుకుంటామని అధికారులు వెల్లడించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఉపాధి పేరుతో హైదరాబాద్ కి వస్తున్నా ఈ సమయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Tags:    

Similar News